Saturday 9 March 2013

సింపుల్ గా క్యారెట్ హల్వా

వంటను సిలబస్లా కాకుండా సింపుల్ గా........


 
 
 క్యారెట్స్ తురుముకోవాలి
 



                                  కుక్కర్లో కాసింత నెయ్యివేసి జీడిపప్పు,కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి



 
 
 
మరికాస్త నెయ్యి వేసి క్యారెట్ పచ్చివాసన పోయేవరకూ వేపుకోవాలి


 
 
తగినంత పాలు(ఇంచుమించుగా కప్పు తురుముకు రెండు కప్పుల పాలు)తగినంత పంచదార (రుచి చూసుకుని వేసుకోవచ్చు)వేసి కలపాలి

 
 
 
 
మూడు విజిల్స్ వచ్చేవరకూ ఉంచి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.పాలు ఇంకా ఉంటే అవి ఇంకి పోయేవరకూ చిన్న సెగ మీద ఉంచాలి.వేయించిన జీడిపప్పు,కిస్మిస్సులతో అలంకరించాలి. వేడి వేడి క్యారెట్ హల్వా రెడీ

No comments: